ATP: కళ్యాణదుర్గంలో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లిన తన సోదరి జుబేదా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆమెను క్షేమంగా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని గుంతకల్లుకు చెందిన షేక్ షబానా మంత్రికి విజ్ఞప్తి చేశారు.