ADB: గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పంచాయతీ కార్యదర్శి అంజలి అన్నారు. గుడిహత్నూర్ మండలంలోని గ్రామంలో కొలుహరి గ్రామంలో గ్రామ సభ్యులతో కలిసి శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, రామ్ కిషన్, గ్రామ నాయకులు తదితరులున్నారు.