NLG: వాడపల్లి పోలీస్ స్టేషన్లో యువకుడిపై థర్డ్ డిగ్రీ హింస చేశారన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు. సాయి సిద్దు, నవీన్ లపై జరిగిన గొడవ కేసులో విధి పరంగా విచారణ చేసి, వైద్య పరీక్షల తర్వాత రిమాండ్కు పంపినట్టు తెలిపారు. ధర్నాలో పాల్గొన్నందుకే కొట్టారన్న వార్తలు తప్పుడు వేనని, మీడియా బాధ్యతతో వ్యవహరించాలని SP కోరారు.