ASR: గంగవరం గ్రామం శివారున రూ. 45లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ వెంకటేశ్ బుధవారం తెలిపారు. ఒరిశా నుంచి రాజమండ్రి వైపు వ్యాన్లో తరలిస్తున్న 900కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ ఘటనలో ఒరిశాకి చెందిన ముగ్గురు, తూ.గో జిల్లాకు చెందిన ఒకరు, అల్లూరి జిల్లాకి చెందిన ఒకర్ని అరెస్ట్ చేశామన్నారు.