కోనసీమ: జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో క్యాన్సర్, కిడ్నీ వ్యాధి కేసుల సంఖ్య అధికంగా ఉందని బుధవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఈ అంశంలో స్పందించి ప్రత్యేకంగా సర్వే చేయించి కారణాలను విశ్లేషించాలని కోరారు. ప్రతీ నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు.