WNP: రైతులకు పారదర్శకంగా యూరియా అందించేందుకు వ్యవసాయ అధికారులు చర్యలుతీసుకోవాలని కలెక్టర్ ఆదర్శం ఆదేశించారు.పెబ్బేర్లోని ఓ ఫర్టిలైజర్ షాప్ను బుధవారం కలెక్టర్ తనిఖీ చేశారు. షాపుకు ఇప్పటివరకు వచ్చిన యూరియా, రైతులకు విక్రయించిన వివరాల రిజిస్టర్ను కలెక్టర్ పరిశీలించారు. రైతులకు అవసరమైన యూరియా అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.