ELR: జీలుగుమిల్లి మండలం మడకంవారిగూడెం పరిధిలో నిర్మించనున్న నౌకాదళ ఆయుధ డిపోపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి దిశగా ఎన్డీయే ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఆ క్రమంలోనే ఆయుధ డిపో నిర్మిస్తున్నామన్నారు. అయితే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.