సత్యసాయి: అమరాపురం చెరువుకు ఐదు రోజుల క్రితం హంద్రీనీవా ద్వారా నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించే జలహారతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాలని సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆహ్వానించారు. సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. నియోజకవర్గానికి నీరు రావడంతో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.