NLG: ఓ పేదింటి బిడ్డ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన కృష్ణ కూతురు ఇందుకు నీట్ ప్రవేశ పరీక్షలో 426 మార్కులు పొంది నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. నీట్ ఎగ్జామ్ సమయంలో తన తండ్రికి తీవ్ర పక్షవాతంతో బాధపడుతూ.. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయిన కష్టాపడి చదివి సీటు పొందిందని కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.