KDP: ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా సిద్ధవటం మండలం ఉప్పరపల్లిలో గురువారం సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేశారు. ఓజీ సినిమా విజయవంతం కావాలని రామయ్య ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.