NLG: అకాల వర్షాలు నిమ్మ రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. వర్షాల పేరుతో దళారులు ధర తగ్గించటంతో రైతులు దిగాలు పడుతున్నారు. పెరిగిన పెట్టుబడులు, రవాణా ఖర్చులు, వ్యాపారుల కమీషన్లను ఎదుర్కొనేలా దిగుబడి వచ్చినా ధర లేక రైతులు తల పట్టుకున్నారు. నకిరేకల్ ప్రాంతంలో ఈసారి భారీగా నిమ్మ దిగుబడులు పెరిగాయి. ప్రస్తుతం బస్తా ధర రూ.300లకి మించడం లేదని రైతులంటున్నారు.