GNTR: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ హైందవ రాష్ట్ర సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని తెనాలి మండలం అంగలకుదురు, సంఘం జాగర్లమూడి గ్రామాల్లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొని దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మానవతావాదం అనే రాజకీయ తత్వాన్ని దీన్ దయాళ్ రూపొందించారని కొనియాడారు.