HYD: చాదర్ ఘాట్ ప్రాంతంలో ప్రాణాంతక రసాయనాలకు మూసీ నదిలో పారవేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని స్థానికులు తెలిపారు. ఓల్డ్ మలక్ పేట్, పద్మా నగర్ వంటి ప్రాంతాల్లో వృద్ధులు, పిల్లలు ఆసుపత్రిలో చేరుతున్నారు. అధికారులు వెంటనే నిఘా పెట్టి, రసాయనాలు పారబోస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.