NZB: ఆలూర్ మండలం కల్లేడి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను బుధవారం ఎంపీడీవో గంగాధర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి కావాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే గ్రామ, మండల అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఫొటోలు ఇప్పటికప్పుడే అప్లోడ్ చేసి లబ్ధిదారులకు సహకరించాలన్నారు.