నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు ధైర్య లక్ష్మి దేవిగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా దేవస్థాన ముఖ్య అర్చకులు మాధవగిరి భాస్కరాచార్యులు కలశ పూజ, విశేష కుంకుమార్చన నిర్వహించారు.