GNTR: గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ కొల్లిపర కమిటీ తరపున బుధవారం గ్రామంలో నిరసన ప్రదర్శన చేశారు. కార్మికుల పని గంటల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతూ సీఐటీయూ నాయకులతో కలిసి చేపట్టిన ప్రదర్శనలో పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. కార్మికులకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.