VZM: వంగర MPDOగా టి.రాజారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నందిగామ డిప్యూటీ MPDOగా పనిచేసిన ఆయన ఎంపీడీవోగా పదోన్నతిపై వంగర వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్యం, సురక్షిత మంచినీటి సరఫరా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేందుకు కృషి చేస్తానన్నారు. ఇక్కడ పనిచేసిన ఎంపీడీవో రఘునాథాచారి జలుమూరు మండల ఏవోగా అక్కడికి వెళ్లనున్నారు.