W.G: గోకవరం గద్దెలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఐదోవ రోజుకు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం అమ్మవారిని మహాలక్ష్మీ దేవిగా నగదుతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.