PLD: ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా వైసీపీ నేతల తీరు మారలేదని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అసెంబ్లీలో శుక్రవారం విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ‘నరకండి, చంపండి’ అంటున్నారని మండిపడ్డారు. చట్టాన్ని అతిక్రమిస్తే చూస్తూ ఊరుకోబోమని, ధైర్యం ఉంటే ఎవర్ని నరుకుతారో పేర్లు చెప్పాలని యరపతినేని హెచ్చరించారు.