CTR: మద్యం మత్తులో కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పుంగనూరు పట్టణం ఎన్టీఆర్ కూడలిలో చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ASI అశ్వర్థ నారాయణ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఈ మేరకు మృతుడిని మండల పరిధిలోని బాలాజీ కాలనీకి చెందిన రామయ్యగా నిర్ధారించారు. భార్యా పిల్లలు కొన్నేళ్లుగా మదనపల్లెలో ఉన్నట్లు కాలనీవాసులు పోలీసులకు తెలిపారు.