ADB: అనాథిగా వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు.