VSP: పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసి లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతిపై హౌసింగ్ అధికారులు, స్పెషల్ అధికారులు, జోనల్ కమిషనర్లు అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరం నందు సమీక్ష చేశారు. జిల్లాలో వివిధ దశలలో ఉన్న పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై దిశా నిర్దేశం చేశారు.