ATP: రాయదుర్గం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో దొంగ ఓట్లతో గద్దెనెక్కిన నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని నిరసిస్తూ సంతకాల సేకరణ బుధవారం నిర్వహించారు. వినాయక కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రజలతో సంతకాలు చేపట్టి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేపట్టారు. అక్కడినుండి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.