నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్లో గురువారం లక్ష దీపోత్సవం జరగనుంది. వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో పదేళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హిమాలయాల్లో శివ పార్వతులు ఉన్నట్లు ఈ ఏడాది సెట్టింగ్ చేశారు. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, అధ్యాత్మిక గురువు రామానంద భారతి ఉపన్యాసాలు ఇవ్వనున్నారు.