BDK: తెలంగాణలో మరో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ, రేపు విచారణ చేపట్టనున్నారు. తిరిగి ఈ నెల 12, 13 తేదీల్లో కూడా విచారణ కొనసాగనుంది. ఈ విచారణలో ఎమ్మెల్యేల న్యాయవాదులను, పిటిషనర్ల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, సంజయ్‌లను విచారించనున్నారు.