SRPT: చిలుకూరు గ్రామానికి చెందిన గంగాధర్ నివాసంలో 12 అడుగుల జొన్న మొక్క స్థానికంగా ఉన్న చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంట్లో స్వతహాగా పెరిగిన ఈ మొక్క 12 అడుగుల ఎత్తుకు చేరిన తర్వాత కంకి కూడా వేసిందని గంగాధర్ తెలిపారు. ప్రజలకు ప్రకృతిపై అవగాహన కల్పించేందుకు తన నివాసంలో ఇలాంటి మొక్కలను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు.