TPT: గూడూరు (M) గొల్లపల్లి గ్రామ సమీపంలోని ఓ నిమ్మ తోటలో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్సై తిరుపతయ్య తెలిపారు. చనిపోయిన వ్యక్తికి 40-50 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని, మూడు రోజుల కిందట ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.