TG: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీల్లో నాలుగో రోజు బంద్ కొనసాగుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఈ బంద్‌ను చేపట్టాయి. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కానీ ప్రభుత్వం వెంటనే సగం బకాయిలు విడుదల చేస్తేనే బంద్‌ను ఉపసంహరించుకుంటామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి.