బీహార్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ 121 స్థానాల్లో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం 9 గంటల వరకు 13.13 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా సహర్సా జిల్లాలో 15.27 శాతం.. అత్యల్పంగా లఖీసరాయ్ జిల్లాలో 7శాతం పోలింగ్ రికార్డయినట్లు వెల్లడించారు. కాగా ఈ విడతలో 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.