2019 మార్చి 31కి ముందు కొనుగోలు చేసిన వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరని కేంద్ర రవాణా శాఖ ప్రకటించింది. ఈ నంబర్ ప్లేట్లను ఈ నెల 30లోగా ఏర్పాటు చేసుకోవాలని.. లేదంటే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్లు నిలిపోతాయని వెల్లడించింది. అమ్మకాలు, కొనుగోళ్లు కూడా సాధ్యం కావని తెలిపింది. ఈ నెంబర్ ప్లేట్ కోసం bookmyhsrp.comలో దరఖాస్తు చేసుకొవాలి.