ELR: జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి శేఖర్ బాబు బుధవారం జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీతో సమావేశమయ్యారు. 1983లో నిర్మించిన కేంద్ర గ్రంథాలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని ఆమెకు వివరించారు. జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న ఏదైనా ఒక భవనాన్ని గ్రంథాలయానికి కేటాయించాలని ఆయన కోరారు. జిల్లా గ్రంథాలయానికి కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.