VZM: ప్రైవేట్ దేవాలయాల్లో రోజులో కనీసం వెయ్యిమంది భక్తులు హాజరయ్యే దేవాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులతో ఆలయాల భద్రతపై బుధవారం సమీక్ష జరిపారు. ఆయా మండలాల్లో ప్రైవేట్ ఆలయాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు.