WNP: ఇటీవల కురిసిన వర్షాలకు ఆగారం నుంచి ఘనపూర్ వెళ్లే ప్రధానరహదారి ప్రమాదకరంగా మారింది. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ నేతలు రెడ్లకుంట చెరువుదగ్గర దెబ్బతిన్న రహదారిని బుధవారం పరిశీలించారు. మున్నూరు జయాకర్ మాట్లాడుతూ.. వర్షాలకు చెరువు అలుగు పారుతుండడంతో నీటి ప్రవాహానికి రోడ్డు కోతకు గురైందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు చేపడతామని తెలిపారు.