BPT: కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో అలుముకొని ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. అల్పపీడనంతో వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు అప్రమత్తమయ్యారు. పొలాలలో నీరు నిల్వ ఉండకుండా గట్లు కొట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.