ASF: దహెగాం మండలం కర్జీ గ్రామ ప్రజలు నాటు సారా అమ్మే వాళ్లను పట్టుకుని బుధవారం పోలీసులకు అప్పగించారు. గత కొన్ని రోజుల క్రితం నాటు సారా అమ్మవద్దని, త్రాగ వద్దని గ్రామ యువత ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు నాటు సారా విక్రయం, రవాణా చేయొద్దని ఎన్నో సార్లు హెచ్చరికలు చేసినా వినక పోవడంతో నాటు రవాణా చేసిన వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.