TPT: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. ఈ నెల 8న ఉదయం 10 గంటలకు రేణిగుంటకు ఆయన రానున్నారు. తర్వాత మామండూరు అటవీ కార్యాలయాన్ని తనిఖీ చేస్తారు. అనంతరం కలెక్టరేట్లో అటవీ శాఖ అధికారులతో జరిగే సమీక్షలో పాల్గొంటారు. 9వ తేదీన పలమనేరు వెళ్తారని సమాచారం. అయితే దీనిపై షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది.