ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌నకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ED విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఢిల్లీలోని ED కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ED సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఇప్పటికే పలువురు క్రికెటర్లను ED అధికారులు విచారించారు.