VKB: మోమిన్పేట్ మండలంలో నంది వాగు ప్రాజెక్టు కుడి కాలువపై నిర్మిస్తున్న వంతెన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వంతెన నిర్మాణం పూర్తయినా ఇరువైపులా రోడ్డు పనులు చేపట్టలేదు. దీంతో ప్రజలు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, రోడ్డు పనులు పూర్తి చేసి వంతెనను ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.