నిర్మాత దిల్ రాజు మరో సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్తో మూవీ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అజిత్, దిల్ రాజ్ కథపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.