VKB: దౌల్తాబాద్ మండలం గోక పస్లాబాద్లో వేరుశనగ విత్తనాల పంపిణీలో గోల్మాల్ జరిగినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ పథకం కింద 100 శాతం రాయితీపై 506 బస్తాలు అందించాలని ఉన్నప్పటికీ, అధికారులు 50 శాతం సబ్సిడీపై 300 బస్తాలు మాత్రమే ఇస్తున్నారని రైతులు వాపోయారు. ప్రశ్నించిన రైతులను అధికారులు దురుసుగా మాట్లాడారని ఆరోపించారు.