లడఖ్ రాజధాని లేహ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్రానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చర్చల పేరుతో కేంద్రం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. బీజేపీ కార్యాలయం ముట్టడికి ఆందోళనకారులు యత్నించారు. ఈ క్రమంలోనే CRPF వాహనాలకు నిరసనకారులు నిప్పంటించారు.