SKLM: జిల్లాలో 2025 డీఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గురువారం అమరావతిలో నియామక పత్రాలను మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా అందజేస్తారు. ఈ సందర్భంగా జిల్లాలో 498 మంది అభ్యర్థులు బుధవారం ఉదయం వారి కేటాయించిన బస్సుల్లో విజయవాడలోని అమరావతికి బయలుదేరినట్లు డీఈవో రవిబాబు తెలిపారు. అలాగే ఎంపిక కాబడిన ప్రతి అభ్యర్థి హాజరవ్వాలని తెలిపారు.