KDP: ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి హత్య నేపథ్యంలో మంగళవారం నుంచి ప్రొద్దుటూరులోని పలువురు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో డీఎస్పీ భావన ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇక్కడి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని వడ్డీ వ్యాపారులు వివరాలు సేకరించి అనంతరం విచారించారు.