పాక్ వెకిలి చేష్టలకు తమ బ్యాట్‌తోనే హుందాగా బదులిచ్చిన టీమిండియాను అసిస్టెంట్ కోచ్ డస్కాటే అభినందించాడు. రౌఫ్, సాహీబ్జాదా సైగల నేపథ్యంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా అద్భుతంగా వ్యవహరించారని పేర్కొన్నాడు. కాగా పాక్ ఆ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్‌నూ కవ్వించే ప్రయత్నం చేసింది. దానిపై ఇప్పటికీ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.