లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నివాసంలో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అధికారులు స్వాధీనం చేసుకున్న కార్లలో ఒక వాహనం దుల్కర్ పేరు మీద రిజిస్టర్ కాలేదు. దీంతో ఆ కారు యజమాని ఎవరనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసు సంబంధించి దుల్కర్‌కు సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.