KDP: ఏపీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిరవధిక బంద్ చేయనున్నారు. ఇందులో భాగంగా బిల్లుల చెల్లింపులో వైద్య ఆరోగ్యశాఖ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అసోసియేషన్, పెండింగ్ బిల్లులను చెల్లించకుండా కొత్త విధానం వైపు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.