ప్రకాశం: కనిగిరి DSP సాయి ఈశ్వర్ యశ్వంత్ పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా దసరా సెలవుల నేపథ్యంలో ఊర్లకు, విహారయాత్రలకు వెళ్లే ప్రజలు స్థానిక పోలీస్, బీట్ కానిస్టేబుల్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇంట్లో విలువైన వస్తువులు బంగారం, వెండి, నగదు ఉంచవద్దని పేర్కొన్నారు. అనంతరం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం అన్నారు.