KDP: ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి పూర్వవైభవం తీసుకువస్తామని స్థానిక MLA నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ప్రొద్దుటూరు మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ మేరకు ఛైర్మన్ వద్ది సురేఖ, వైస్ ఛైర్మన్ పట్నం లక్ష్మన్ కుమార్, డైరెక్టర్లతో సెక్రటరీ రత్నరాజు ప్రమాణ స్వీకారం చేయించారు.