KDP: కాశినాయన మండలం గొంటువారిపల్లెలో అంగన్వాడీ భవనం లేక పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు గ్రామంలో బాడుగ ఇళ్లను అద్దెకు తీసుకుని చదువు నేర్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు అంగన్వాడీ భవనం గత 2 సంవత్సరాలుగా పూర్తి స్థాయికి వచ్చి పనులు నిలిచిపోయాయి. ఆ భవనం చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలను శుభ్రం చేసేవారు లేక అంగన్వాడీ భవనం శిథిలావస్థకు చేరుతోందని వాపోతున్నారు.