VSP: ఢిల్లీలో అధ్యయన యాత్రలో ఉన్న విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్లను రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు కలిశారు. బుధవారం ఆయన కార్పొరేటర్లు బస చేసిన హోటల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లతో ఆయన సుమారు గంటసేపు ముచ్చటించారు. దేశంలోని వివిధ నగరాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేసి, వాటిని విశాఖపట్నంలో ఎలా అమలు చేయవచ్చో పరిశీలించాలని సూచించారు.